- డబుల్ ఇంజిన్ పాలిత రాష్టాల్లో అభివృద్ధి శూన్యం
- సంక్షేమ ప్రభుత్వ పాలన దేశానికే తమానికం
- సంక్షేమ పథకాలను ఆకర్షితులై బిజెపి నుంచి బిఆర్‌ఎస్‌లో చేరుతుండ్రు
- రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
- కోహీర మండల అభివృద్ధికి అన్ని చరకాల చర్యలు
- జహీరాబాద్ ఎంపి బిబి పాటిల్
కోహీర్: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదల ప్రజలకు, కులమతాలకతీతంగా అనేక సంక్షేమ పథకాలను అ మలు చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి దేశంలోఅన్ని రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా సిఎం కెసిఆర్ తీర్చిదిద్దుతున్నారని, సబ్బండవర్గాల అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగిస్తూ అన్ని వర్గాల అవారికి సమ ప్రాధాన్యం ఇ స్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఈ సందర్భ ంగా మండల కేంద్రమైన కోహీర్‌కు చెందిన ఆయా పార్టీల నాయకులు, బిజెపి మండల మాజీ అధ్యక్షుడు మనోహర్ బృందం మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ పాలన తెలంగాణ రాష్ట్రంలో సాగుతుందని, సబ్బండ వర్గాల అభివృద్ధే ధ్యేయంగా సిఎం కెసిఆర్ ఎంతగానో ఆహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. అలాగే డబుల్ ఇంజిన్ పాలిత రాష్ట్రాల్లో తీ వ్ర విద్యుత్ కొరతతో అల్లాడుతున్నారన్నారు. సిఎం కెసిఆర్ దర్శనికథతో తెలంగాణ రాష్ట్రంలో 24గంటల విద్యుత్ అమలు చేస్తూ అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. అనంతరం ఎంపి బిబి పాటిల్ మాట్లాడుతూ కోహీర్ మండలాభివృద్ధికి అ న్ని రకాల చర్యలు తీసుకుంటామని, తెలంగాణ రాష్ట్రంలో కులమతాలకతీతంగా అన్ని సంక్షేమ పథకాలను అందిస్తున్నది బిఆర్‌ఎస్ ఒక్కటేనన్నారు.
ఎం డలు తీవ్రంగా ఉన్నప్పటికీ చెరువులు, వాగుల్లో మత్తళ్లతో నీళ్లు కళకళలాడుతున్నాయని, రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తూ వారి సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ పాటు పడుతున్నారన్నారు. తెలంగాణ రా ష్ట్రంలో గంగ జమునతహెజీజ్ సంస్కృతిని ప్రోత్సహిస్తూ పాలన సాగుతుందని, పార్టీ పటిష్టత కోసం ప్రతి కార్యకర్తతో కలిసి సైనికుల్లా పని చేయాలని నాయకులకు సూచించారు. బిఆర్‌ఎస్‌లో చేరిన బిజెపి మండల మాజీ అధ్యక్షుడు మనోహర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి బిఆర్‌ఎస్‌లోచేరినట్లు తెలిపారు. అలాగే బిఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. బిఆర్‌ఎస్‌లో చేరి 50మంది ఆయా పార్టీల నాయకులకు బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నర్సింలు యాదవ్ స్వాగతం పలికి ప్రత్యేక ఆహ్వానిస్తున్నట్లు నర్సింలు యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు ఒమర్ అహేమద్, ఎంపిటిసి సవుద్ షాహిద్, మాజీ పట్టణ అధ్యక్షుడు ఇఫ్తెకర్ అలీ, సీనియర్ నాయకులు మహ్మద్ రా వుస్,బ్యాగరి రాజ్ కుమార్, మహ్మద్ ఆరిఫ్, శ్రీనివాస్, దినకర్, బాగప్ప, మనియర్‌పల్లి మనోహర్, మధుకర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.