కరీంనగర్ :ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 158 ధరఖాస్తులను జిల్లా కలె క్టర్ ఆర్.వి. కర్ణన్ స్వీకరించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ప్రతి దరఖాస్తుపై సంబంధిత శాఖల అధి కారులు సత్వరం చర్యలు తీసుకోవాలని అన్నారు. దరఖాస్తులతో అర్జీదారులు విన్నవించే సమస్యలను గురించి అధికారులు తెలుసు కుంటు, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 158 దరఖాస్తులను స్వీకరించగా అందులో మున్సిపల్ కార్పోరేషన్ కు 18, తహసీల్దార్ కొత్తపల్లి 10, తహసీల్దార్ చిగురు మామిడి 08 ఫిర్యాదులురాగా మిగిలిన శాఖలన్నింటికి కలిసి 122 ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందని అయన తెలిపారు.ఈ కార్యక్ర మంలో అదనపు కలెక్టర్లు జి.వి. శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, ట్రైని కలెక్టర్ లెనిన్ వాత్సల్ టోప్పో, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గోన్నారు.