- వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత మహంతి
మెదక్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 14న వైద్యారోగ్య దినోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా సోమవారం మెదక్ కలెక్టర్ రాజర్శి షా అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌లో దశాబ్ది ఉత్సవాల్లో చేయవలసిన పనులు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ, ఎన్‌సిడి కాంబినేషన్ మందుల పంపిణీ, ఎఎన్‌ఎమ్‌లకు బిపి ఆపరేటర్ల పంపిణీ, ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు అవార్డుల ప్రదానం, మెదక్ నియోజకవర్గ ప్రగతి నివేదిక గురించి చర్చించారు. 14న వైద్యారోగ్య దినోత్సవం మాయ గార్డెన్స్ చేగుంట రోడ్ మెదక్‌లో ఏర్పాటు చేయడం జరుగుతుంది , ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్వహించాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ , జిల్లా వైద్యా రోగ్యశాఖ అధికారి చందు నాయక్, డిఎస్‌ఓ డా. నవీన్, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ మాధురి , డాక్టర్ రామ్మోహన్ , డాక్టర్ విజయనిర్మల, ఉప జిల్లా వైద్యాధికారులు డాక్టర్ అనిలా, డాక్టర్ అరుణశ్రీ మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.