మంచిర్యాల : శారీరక దృఢత్వం ఉంటే ఆత్మ విశ్వాసంతో ఏదైనా సాధించవచ్చని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం తెలంగాణ రన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఏ సీపీ తిరుపతిరెడ్డి, జిల్లా క్రీడా యువజన సర్వీసుల శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డితో కలిసి జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుండి జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మైదానం వరకు 2కే రన్ నిర్వమించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ శారీరక దృఢత్వం ఉంటే ఆత్మ విశ్వాసంతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చన్నారు. యువత ప్రతిరోజు పరుగు, వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ కొరకు ప్రభుత్వం ప్రజల సౌకర్యార్దం ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
గత 9 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలను ప్రజలందరికి తెలి సే విధంగా ప్రభుత్వం ఈ నెల 2 నుంచి 22 వరకు 21 రోజుల పాటు వేడుకలను నిర్వహించ తలపెట్టిందన్నారు. ఈ ఉత్సవాల్లో ప్రజ లు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
ప్రజల సంక్షేమం కోసం వైద్య కళాశాలలు, సమీకృత కలెక్టేరేట్‌లు, వైకుంఠదామాలు, డంపిం గ్ యార్డులు, ఆసరా పించన్‌లు, కేసీఆర్ కిట్, సమీకృత కూరగాయల మార్కెట్, తదితర ఎన్నో సంక్షేమాభివృద్ది పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.