Monday, December 23, 2024

ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాలు ఏర్పాటు

- Advertisement -
- Advertisement -
9 ఏళ్లలో 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దే
వైద్య సేవ రంగంలో తెలంగాణను సిబ్బంది మొదటి స్థానంలో నిలపాలి
మెడికల్ కళాశాల్లో ర్యాగింగ్ లేకుండా చూడాల్సిన బాధ్యత ప్యాకల్టీదే
టీచింగ్ ఆసుపత్రుల నెలవారీ సమీక్ష సమావేశంలో మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. 60 ఏళ్లలో 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, 9 ఏళ్లలో 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందన్నారు. అతి తక్కువ సమయంలో మొత్తం 21 మెడికల్ కాలేజీలు ప్రారంభించి తెలంగాణ దేశంలో రికార్డు సృష్టించిందన్నారు. పెద్ద మొత్తంలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ, వైద్య సిబ్బందిని నియమిస్తూ ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేసినట్లు చెప్పారు.

ఇటీవల ఏక కాలంలో 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియమించడంతో టీచింగ్ ఆసుపత్రులు మరింత బలోపేతమైనట్ల్లు చెప్పారు. సోమవారం టీచింగ్ ఆసుపత్రుల నెలవారీ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, డిఎంఇ రమేష్ రెడ్డి, అరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందెందుకు, ప్రభుత్వం తరఫునుంచి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మీ వంతుగా ప్రతి ఒక్కరు బాగా పని చేయాలనీ కోరారు. కొద్ది కాలం నుండి మనందరం చేస్తున్న కృషి వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఘనంగా ప్రకారం మాతృ మరణాల రేటు రాష్ట్రంలో ఘనంగా తగ్గింది.

రాష్ట్రం ఏర్పడినప్పుడు 92 గా ఉంటే ఇప్పుడు 43కు తగ్గించగలిగామని తెలిపారు. వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉంది. ఇవన్నీ మీరంతా చేస్తున్న కృషికి నిదర్శనం. అయితే దీంతో మనం సంతృప్తి చెందకూడదన్నారు. ఆరోగ్య రంగంలో తెలంగాణ నెంబర్ 1 గా నిలవాలి. సీఎం కేసీఆర్ పెద్ద మొత్తంలో బడ్జెట్ ఇచ్చి కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు వైద్యుల నియమాకంతో పాటు వైద్య పరికరాలు ఇచ్చినట్లు చెప్పారు. మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ విద్యార్థులకు రోల్ మోడల్ గా టీచింగ్ ఫాకల్టీ ఉండాలని, క్రమశిక్షణ గా ఉండేలా చూడాలన్నారు. ర్యాగింగ్ లాంటివి లేకుండా చూడాలని యాంటి ర్యాగింగ్ గురించి కాలేజీలో ప్రచారం చేయాలని సూచించారు. క్లినికల్ హాస్పిటల్ మేనేజెంట్ డ్యూటీల విషయంలో ఉన్నతాధికారులదే పూర్తి బాధ్యత. రౌండ్ ద క్లాక్ సేవలు అందించాలని, అవసరం అయితే తప్ప రెఫర్ చేయకూడదన్నారు. స్పెషాలిటీ సేవలు జిల్లా పరిధిలోనే అందాలని మనం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఎన్ ఎం సి నిబంధనలు ప్రకారం నడుచుకునేలా మెడికల్ కాలేజీలను చూడాల్సిన బాధ్యత సూపరింటెండెంట్ ల పైన ఉందని తరగతులు అనుమతుల విషయంలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. స్టయిఫండ్స్ వేతనాలకు సంబంధించి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నామని, ఇటీవల 15 శాతం కూడా పెంచినట్లు ఎలాంటి ఆలస్యం జరగకుండా సూపరింటెండెంట్ లు చూసుకోవాలని ఆదేశించారు. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ జరిగే దిశగా ప్రయత్నాలు చేయాలి. అవయవ దానం ప్రోత్సహించి, ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు. పరికరాల నిర్వహణ విషయంలో పీఎంయు ఏర్పాటు చేసుకున్నట్లు రూ. 5 లక్షలకు పైబడి విలువ చేసే వైద్య పరికరాల వివరాలు పూర్తిగా పొందుపరిచాలి. ప్రతి ఆసుపత్రి సూపరింటెందెంట్ చెక్ చేసుకోవాలి. ఆసుపత్రుల్లో ఎన్ని వైద్య పరికరాలు పిఎంయు పరిధిలో ఉండాలని అన్ని వైద్య పరికరాలు పని చేసేలా చూసుకోవాలన్నారు. డిశ్చార్జ్ అయిన పేషెంట్లకు ఉచితంగా మందులు ఇచ్చి పంపాలని ఈ విషయం పేషెంట్లకు తెలిసేలా బోర్డ్ ఏర్పాటు చేయాలని చెప్పారు.

56 టిఫా స్కానింగ్ మిషన్లను ఏకకాలంలో ప్రారంభించుకున్నాం. అన్ని వైద్య పరికరాలు పనిచేసేలా చూసుకోవాలి గర్భిణులకు సేవలు అందాలి. కొత్త మెను ప్రకారం డైట్ అందుతుందా లేదో తరుచూ చెక్ చేసుకుని ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ విషయంలో ఇప్పటికే శిక్షణ కూడా పూర్తి చేసాము. ప్రతి సోమవారం కమిటీ మానిటరింగ్ చేసుకోవాలి. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి. ఉదయం 9 గంటల వరకు ప్రతి ఒక్కరూ విధుల్లో ఉండాలి. కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు వైద్యంతో పాటు బోధన పరిశోధనపై దృష్టి సారించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News