Monday, December 23, 2024

యువకుడి అనుమానాస్పద మృతి

- Advertisement -
- Advertisement -

బషీరాబాద్: చెట్టుకు ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బషీరాబాద్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. బషీరాబాద్ మండల పరిధిలోని నవల్గా గ్రామ శివారులోని సాయిలుగౌడ్ రైతు పొలం లో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సురేష్ చెట్టు కు ఉరేసుకుని మృతి చెందడంతో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన యువకుడు లోకల్ కాదని ఇక్కడికి ఎలా వచ్చాడో ఎవరైనా హత్య చేసి వెళ్లిపోయారా అని స్థానికులు చర్చించుకుంటున్నారు.

సమాచారం అందుకు న్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతి చెందిన సురేష్ కుటు ంబసభ్యులకు సమాచారం అందించగా మృతుడి సోదరుడు పుష్ప రాం సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News