మాస్ మహారాజా రవితేజ పీపుల్ మీడి యా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందించిన ‘ధమాకా’ తో తన కెరీర్లో బిగ్గెస్ట్ సోలో హిట్ అందుకున్నారు. సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేయబోతున్న మాసీవ్ ప్రాజెక్ట్ కోసం రవితేజ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్‌తో మళ్లీ కలిసి పని చేస్తున్నారు. మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను ఒక గ్లింప్స్ ద్వారా విడుదల చేశారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. రవితేజ మోస్ట్ వాంటెడ్ పెయింటర్. అతన్ని పట్టుకోవడానికి ‘రా’ ఏజెన్సీ వెతుకుతుంటుంది. ఇంతలో ఓ వ్యక్తి.. అతను పత్తి పండించే రైతు అని చెబుతాడు. తనకి ఇంకొన్ని అవతారాలు కూడా ఉన్నాయి.
Also Read: మరో ఐదేళ్లు కష్టపడితే అన్నింటా మనమే టాప్
చివరగా రవితేజ ఒక సరస్సు దగ్గర నిలబడి పాక్షికంగా తన ముఖాన్ని చూపిస్తారు. ఆ తర్వాత ‘ఈగల్’ అనే టైటిల్‌ని తెలియచేశారు. టైటిల్ స్ట్రైకింగ్‌గా వుంది. గ్లింప్స్ కథానాయకుడి ప్రపంచాన్ని చూపించింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, మధుబాల వంటి ప్రముఖ తారాగణం కూడా కనిపించారు. కావ్యా థాపర్ మరో కథానాయిక. విజువల్స్ అత్యద్భుతంగా ఉన్నాయి. నేపధ్య సంగీతం కూడా ఎక్స్‌ట్రార్డినరిగా ఉంది. కార్తీక్ ఘట్టమనేని రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిబాబు కరణంతో పాటు దర్శకుడు స్వయంగా స్క్రీన్ ప్లే రాశా రు. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోం ది. గ్లింప్స్ ద్వారా నిర్మాతలు ఈగల్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.