Monday, December 23, 2024

న్యూజెర్సీ స్పెషల్.. మోడీజీ కీ థాలి

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనను పురస్కరించుకుని ఆయన గౌరవార్థం న్యూజెర్సీలోని ఒక భారతీయ రెస్టారెంట్ మోడీజీ కీ థాలిని ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 21న అమెరికాను సందర్శించనున్నారు.
మోడీజీ కీ థాలిలో సర్సోంకా సాగ్, ఇడ్లీతోపాటు కిచిడి, రసగుల్లా, కశ్మీరీ దమ్ ఆలూ, డోక్లా, ఛాచ్, పాపడ్ ఉంటాయి.
అదే విధంగా&భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ గౌరవార్థం మరో థాలిని కూడా ప్రారంభించాలని రెస్టారెంట్ యజమాని భావిస్తున్నాడు.

ప్రధాని ఘన స్వాగతం పలికేందుకు భారతీయ-అమెరికన్లు భారీ సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 18న అమెరికాలోని 20 నగరాలలో భారత సమైక్యతా దినోత్సవ యాత్రలను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

జూన్ 21వ తేదీ మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానంలో వస్తున్న ప్రధాని మోడీకి న్యూయార్క్‌లోని ఆండ్య్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో స్వాగతం పలకాలని భారతీయ-అమెరికన్ల ప్రతినిధి బృందం భావిస్తోంది. వాషింగ్టన్‌లో మోడీ బస చేసే వైట్ హౌస్ సమీపంలోని విల్లార్డ్ ఇంటర్‌కాంటినెంటల్ హోటల్ ఎదుట ఉన్న ఫ్రీడమ్ ప్లాజా వద్ద 600 మందికి పైగా గుమికూడాలని భారతీయులు భావిస్తున్నారు. ఫ్రీడమ్ ప్లాజా వద్ద కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ప్రతిబింబించే భారతీయ సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శించాలని కూడా వారు యోచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News