Saturday, December 21, 2024

రేపు రాత్రి హైదరాబాద్‌కు అమిత్ షా.. వాళ్లతో సమావేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్ర మంత్రి అమిత్ షా బుధవారం రాత్రి హైదరాబాద్ కు రానున్నారు. రేపు రాత్రి 10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఎల్లుండి ఉదయం హైదరాబాద్‌లో ముఖ్య నేతలతో అమిషా సమావేశం కానున్నారు.  అనంతరం భద్రాచలంకు బయలు దేరనున్నారు. రాష్ట్ర బీజేపీలో విభేదాల మధ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ఖమ్మంలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ప్రస్తుతం అమిత్ షా పర్యటన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

షెడ్యూల్ ప్రకారం ఖమ్మంలో బహిరంగ సభ అనంతరం షా హైదరాబాద్ చేరుకుంటారు. రాష్ట్ర శాఖలో ఇటీవలి అంశాలపై ఆయన చర్చించే అవకాశం ఉంది. ఖమ్మంలో పార్టీ బలహీనంగా ఉన్నందున, పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నందున అమిత్ షా సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు ఏ మాత్రం తిరుగులేని ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా వామపక్షాల ప్రభావం ఉన్న ప్రాంతంలో లక్ష మందిని సమీకరించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News