Monday, December 23, 2024

ఫెడెక్స్ కొరియర్ పేరుతో నేరగాళ్ల మోసాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సైబర్ నేరగాలళ్లు రోజురోజుకు కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఫెడెక్స్ కొరియర్ సంస్థ పేరుతో నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. మీరు పంపిన పార్శిల్ లో డ్రగ్స్ ఉన్నాయని పలువురిని బురిడీ కొట్టిస్తున్నారు. ఎయిర్ పోర్టు లో డ్రగ్స్ గుర్తించామని నేరగాళ్లు చెప్తున్నారు. నార్కోటిక్ అధికారిగా మాట్లాడి భయపేడుతున్నారు.

వ్యక్తుల, ఆధార్, పాన్ కార్డు వివరాలను ఈ ముఠా సేకరించింది. వాటి ఫొటోలు పంపి అమాయక ప్రజలను నమ్మిస్తున్నారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయకుండా సహకరిస్తామని చెబుతూ.. డబ్బు ఇస్తే అరెస్ట్ చేయకుండా ఉంటామని నమ్మించి మోసం చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం ఓ మహిళ నుంచి ఈ ముఠా భారీగా వసూలు చేసింది. దీంతో హైదరాబాద్ చెెందిన బాధితురాలు రూ. 80 లక్షలు చెల్లించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు ఇలాంటివి 10 కేసులు బయటపడ్డాయి. వారి వద్ద నుంచి కోటి రూపాయలకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News