బీర్పూర్: మండలంలోని రోళ్ల వాగు ప్రాజెక్టును రూ.136 కోట్లతో 1 టిఎంసి స్టోరేజ్‌తో ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రోళ్ల వాగు ప్రాజెక్టును మంగళవారం డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, జడ్పి చైర్ పర్సన్ దావ వసంతలతో కలిసి మంత్రి ఈశ్వర్ సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అని ప్రతి పక్ష నాయకులు అంటున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కలిగే ఉపయోగం జిల్లాలో నిర్మించిన కాలువలు, తూములు పండిన పంట, కొన్న ధాన్యం లెక్కలతో సహా వారంలో చెప్తామని అన్నారు.
ప్రతిపక్ష నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, వారి రాజకీయ అనుభవాన్ని మొత్తం ప్రజలను మభ్య పెట్టి, తప్పు దోవ పట్టించే ప్రయత్నమే అని, ఇది సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం గుట్టలు గుట్టలుగా ఉందని, ఒక్కో గ్రామంలో 40 వేల క్వింటాళ్ల వరకు ధాన్యం పండిందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి 20 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామని, వ్యవసాయాన్ని వృద్ధ్ద్ది చేసి వ్యవసాయాన్ని పండగలా సిఎం మార్చారని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టే విధంగా జీవన్‌రెడ్డి అనుభవాన్ని అంతా కూడగట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని, ప్రజలు, రైతులు గుర్తించాలన్నారు. 40 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారానికే పరిమితం అయ్యిందని, ప్రజలు, రైతుల అవసరాలు తీర్చలేక పోయిందని, తెలంగాణ ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ అండ అని అన్నారు.
ఇందిరా గాంధీని విమర్శించిన రోజులు మరిచారా: ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
రోళ్ల వాగు ప్రాజెక్టు ద్వారా ఒక టిఎంసి నీరు ఇచ్చి ఓట్లు అడగాలని అనడం సరికాదని, గతంలో ఎస్ఆర్ఎస్పి, పోచంపాడు ప్రాజెక్టులు కట్టినప్పుడు వెంటనే నీళ్లు ఇవ్వడం జరగలేదని ఇందిరా గాంధీని విమర్శిస్తూ రాజకీయాలు చేసిన రోజులు మర్చిపోయారా అని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు కాలువలు తవ్వి ప్రాజెక్టు కట్టడం మర్చిపోయారని, నేడు ముఖ్యమంత్రి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు సాగు నీటి వసతులు ఉపయోగంగా మలిచారని అన్నారు. ప్రతి ప్రాజెక్టు విషయంలో ఎస్టిమేషన్ కాస్ట్ అనేది పరిస్థితులకు తగినట్టు పెరుగుతుందని, వరద కాలువ పివి నర్సింహరావు శంకుస్థాపన చేసినపుడు ఉన్న ఎస్టిమేషన్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్టిమేషన్ కాస్టుకు తేడా వారికి తెలుసని అన్నారు.
ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు చేయడం మానుకోవాలని, ప్రజలను అండగా ఉన్న ప్రభుత్వం బిఆర్ఎస్ అని పేర్కొన్నారు. మంత్రి వెంట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, కెడిసిసి జిల్లా సభ్యులు ముప్పాళ్ల రాంచందర్‌రావు, జిల్లా, మండల రైతు బంధు సమితి కోకన్వీనర్ కొల్ముల రమణ, రాజేశం, ఎస్ఇ జి.అశోక్, మాజీ జడ్పిటిసి శంకర్, మాజీ మండల అధ్యక్షుడు వెంకటేష్‌యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు నారపాక రమేష్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, సర్పంచ్ శిల్ప రమేష్, ప్రధాన కార్యదర్శి శీలం రమేష్, సోషల్ మీడియా కన్వీనర్ వినోద్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌రావు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ఉప సర్పంచ్‌లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.