Friday, December 20, 2024

మహిళ సంక్షేమంలో తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -
  • కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్

ఆమనగల్లు : మహిళ సంక్షేమంలో తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శమని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు చాలా ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. ఆమనగల్లు మండల కేంద్రంలో మంగళవారం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆమనగల్లు, కల్వకుర్తి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళ సంక్షేమ దినోత్సవ సంబురాలను భారీ ఎత్తున నిర్వహించారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, మహిళ ఉద్యోగులు, మహిళ సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్ హాజరయ్యారు. ఆమనగల్లు సీడీపీఓ సక్కుబాయి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో జ్యోతి ప్రజ్వలన చేసి, మహిళ సంక్షేమ దినోత్సవ సంబరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. మహిళ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో భాగంగా బతుకమ్మలతో మహిళల ఆట, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన దశాబ్ది ఉత్సవాల్లో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ గర్భిణీలకు ఇచ్చే న్యూట్రిషన్ కిట్లు, ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి తొలి అడుగు అని అన్నారు. ఆడబిడ్డ పుట్టిందంటే ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టినట్టేనని కెసీఆర్ కిట్టుతో పాటు అందే 13 వేలు, ప్రతి పుట్టిల్లు ఎప్పటికి మరువలేని మేలు అని తెలిపారు.

తెలంగాణ ఆడబిడ్డలకు కార్పోరేట్ విద్యకు ధీటైన గురుకులతో తల్లిదండ్రుల కళలను సాకారం చేశారని, ఒంటరి మహిళలకు ఫించన్లు, కళ్యాణ లక్ష్మీ, ఆరోగ్య లక్ష్మీ, ఆరోగ్య మహిళ, పోలీసు శాఖలో, మార్కెట్ కమిటిల్లో రిజర్వేషన్లు, షీటిమ్స్, వి హబ్ ఏర్పాటు చేసి, ప్రసూతి సెలవులు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. ఈ సందర్భంగా కడ్తాల మండలానికి చెందిన 10 మహిళ సంఘాలకు 18 కోట్ల 80 లక్షలు, వెల్దండ మహిళ సంఘాలకు 10 కోట్ల రుణాలను అందించారు. 26 మందికి కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను అందించారు. మహిళ సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉద్యోగులకు అవార్డులను అందించారు.

కార్యక్రమంలో జెడ్పిటిసిలు నేనావత్ అనురాధ పత్యనాయక్, జర్పుల దశరథ్‌నాయక్, ఎంపిపిలు మనోహర, దేపావత్ కమ్లీమోత్యనాయక్, వైస్‌ఎంపీపీ శంకర్‌నాయక్, మార్కెట్ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్‌రెడ్డి, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ యడ్మ సత్యం, సర్పంచులు గూడూరు లక్ష్మీనర్సింహ్మరెడ్డి, సోనాశ్రీనునాయక్, ఎంపిటిసిలు సరిత పంతూనాయక్, దోనాదుల కుమార్, ఆర్డీవో రాజేష్, తహసిల్దారు జ్యోతి, కౌన్సిలర్ కమటం రాధమ్మ వెంకటయ్య, కల్వకుర్తి సీడీపీవో వెంకటమ్మ, సూపర్‌వైజర్ భక్తశబరి, ఆమనగల్లు సీఐ జాల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News