- సిపి శ్వేత
సిద్దిపేట: అడ్వాన్స్ సప్లమెంటరీ పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని సిపి శ్వేత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి 22 వరకు పరీక్షల సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని గవర్నమెంట్ హైస్కూల్ ఉర్డూ మీడియం నాసర్ నందు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అమలులో ఉంటుందన్నారు. పరీక్షలు జరిగే సమయంలో జిరాక్స్ సెంటర్స్ మూసి వేయాలని, పరీక్ష సెంటర్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దని, పరీక్షలకు కట్టదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశామన్నారు. సంబంధిత పోలీస్ అధికారులు పరీక్ష సమయంలో పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.
పోలీస్ స్టేషన్ నుండి పరీక్ష పత్రం పరీక్ష కేంద్రానికి వెళ్లే సమయంలో కానిస్టేబుల్ తప్పనిసరిగా ఎస్కార్ట్ ఉండాలని, పరీక్ష కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అదేశించారు. విద్యార్థినీ, విద్యార్థ్ధులు పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని మానసికంగా ఎటువంటి అందోలన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు.