- దశాబ్ది ఉత్సవాల్లో మహిళా ప్రజాప్రతినిధులు
సిద్దిపేట: మహిళల అభ్యున్నతి కోసం సిఎం కెసిఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని మున్సిపల్ చైర్‌పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు అన్నారు. మంగళవారం సిద్దిపేటలోని విపంచి కళా నిలయంలో ఐకెపి, అంగన్‌వాడీ మెప్మా మహిళా సంఘాలతో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్దించాక మహిళలు అన్నిరంగాల్లో ముందంజలో వెలుతున్నారన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తూ ఆర్థికంగా ఎదగడానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో తోడ్పాటు అందించిందన్నారు. మహిళలకు వడ్డి లేని రుణాలను అందిస్తూ ఆర్థికంగా ఎదగడానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో తోడ్పాటు అందించిందన్నారు.
గర్బవతులను బాలింతలను చిన్న పిల్లలకు పోషక ఆహారాలు అందించడంలో ఆరోగ్య వివరాలు చెప్పడంలో అంగన్‌వాడీలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వంలోనే మహిళలకు పూర్తి న్యాయం జరుగుతోందని రాజకీయంగా కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. దశాబ్ది కాలంలో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు దూసుకు వెలుతుందని అందులో మహిళలను కూడా బాగస్వామ్యులను చేయడం స్వాగతించదగ్గ విషయమని అన్నారు. అనంతరం మహిళా ప్రజాప్రతినిధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ డిఈ శ్రీరామ్ రెడ్డి, సిడిపిఓ రమాదేవి, ఐసిడిఎస్ సూపర్ వైజర్ శోభ, ఈజీఎస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ తుపాకుల బాల్ రంగం, రూరల్ ఎంపిపి శ్రీదేవి, ఎంపిఎం మహిపాల్ రెడ్డి, నియోజక వర్గంలోని ఆయా మండలాల గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.