Tuesday, November 26, 2024

మహిళలు అన్ని రంగాల్లో పురోగమించాలి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : మహిళలు అన్ని రంగాలలో పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మహిళా సంక్షేమ దినోత్స వం సంబరాలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మహిళా లోకం పెద్ద ఎత్తున తరలిరాగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కు మార్ హాజరయ్యారు. జ్యోతిని వెలిగించి మహిళా సంక్షేమ దినోత్సవ సంబరాలను కలెక్టర్ ప్రారంభించారు.

ఇందులో భాగంగా బతుకమ్మలతో మహిళల ఆట పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ దశాబ్ద తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ ం మహిళల అభ్యున్నతి, సాధికారతే ధ్యేయంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ముఖ్యంగా తల్లి కడుపులో ఎదుగుతున్న దశలోనే ఆడపిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడం తల్లిబిడ్డ ల ఆరోగ్యానికి కీలకంగా మారిందన్నారు. జాతీ య శాంపిల్ సర్వే ద్వారా జిల్లాలో పౌష్టికాహార లోపంతో శిశు జననాల పరిస్థితిని అధిగమించేందుకు కెసిఆర్ పౌష్టికాహార లోపంతో శిశు జననాల పరిస్థితిని అధిగమించేందుకు కెసిఆర్ పౌష్టికాహా రం కిట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.

ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్ల సమన్వయంతో గర్భిణీ స్త్రీలకు రెండు పర్యాయాలు న్యూట్రిషన్ కిట్లను అందజేయడమే కాక వారికి కావాల్సిన వైద్య సదుపాయాలను, మందులను ఉచితంగా అందించిందన్నారు. రెండు సంవత్సరాల క్రితం నిర్వహించిన జాతీయ శాంపిల్ సర్వే ద్వారా జిల్లా సత్పలితాల ను సాధించిందని, ఆరోగ్యకరమైనర శిశువుల జన నం జరుగుతుందన్నారు. జిల్లాలో పిల్లల్లో ఎత్తుకు తగ్గ బరువు, బరువు తగ్గ ఎత్తు లోపాలతో 4 వేలకు పైగా ఉన పిల్లల సంఖ్యను 179కి తీసుకురావడం లో మహిళా ఉద్యోగుల పాత్ర గణనీయంగా ఉంద ని ఆయన అభినందించారు.

మహిళా సంక్షేమానికి విప్లవాత్మక పథకాలను, కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చే స్తుందని, మహిళల ఆరోగ్య పరిరక్షణకు, భద్రతకు వారు అన్ని రంగాలలో రాణించేందుకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. వీటిని ఉపయోగించుకుని ఆర్థికంగా, సామాజికం గా మహిళలు ముందడుగు వేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పారిశ్రామిక అభివృద్ధికి రుణాల స్వాలంబన దిశగా మహిళలు అడుగులు వేయాలని ఆకాంక్షించారు. మహిళల భద్రతకు రాష్ట్ర ప్ర భుత్వం అధిక ప్రాధాన్యాత ఇస్తుందన్నారు. భద్రతాపరమైన విషయాన్ని మహిళలు స్వీయ భద్రతను పరిరక్షించుకోవాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలు రక్తహీనతను గుర్తించి రక్తహీనతను అధిగమించేలా చర్యలు చేపట్టాలన్నా రు. ప్రతి అంగన్వాడిలో తప్పనిసరిగా కిచెన్ గార్డెన్‌లను ఏర్పాటు చేసి అక్కడే పండిన తాజా కూరగాయలతో పిల్లల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇ వ్వాలన్నారు. అంతకు ముందు అదనపు ఎస్పి రా మేశ్వర్ మహిళా చట్టాలపై వివరించారు. మహిళ లు తమ రక్షణకై 100 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు. 040 27852246 నెంబర్‌ను కూ డా సంప్రదించి రక్షణ పొందాలని కోరారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన 50 మంది మహిళా ఉద్యోగులను శాలువా తో సత్కరించి బహుమతులను ప్రదానం చేశారు.

నాగర్‌కర్నూల్ ఆర్డిఓ నాగమణి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి రామేశ్వర్, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని వెంకటల క్ష్మి, జిల్లా భూగర్భ జల అధికారిని రమాదేవి, డిఆర్‌డిఓ నర్సింగ్ రావు, జిల్లా పరిషత్ సిఈఓ భాగ్యలక్ష్మి, ఎల్‌డిఎం కౌశల్ కిషోర్ పాండే, డిపిఎం అ రుణాదేవి, సిడిపిఓ సంగీత, శ్రీనిధి ఆర్‌ఎం మహే ంద్ర, మహిళలు వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగు లు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News