ఎల్బీనగర్ : రాష్ట్రంలో ప్రథమంగా అడ్వాన్స్ న్యూరో సెంటర్‌ను కామినేని ఆసుపత్రిలో ప్రారంభించారు. కామినేని ఆసుపత్రి ఇందిరా అడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోన్యూరో సర్జీరీ వైద్యులు ఎం ఏ జలీల్ ,రమేష్ ,బహుముకి చుడుసామ ,న్యూరాలజీ వైద్యులు నవీన్ కూమార్ ,కమలేష్ చౌడా ,లక్ష్మీ లావణ్య ,న్యూరో ఫిజియథేరపీ వైద్యులు సారదీ గౌడ్ ,రేణుడీసౌజా వైద్యులు అడ్వాన్స్ న్యూరో సెంటర్‌ను వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో జెనిటిక్స్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకువచ్చామని , మానవ శరీరంలో మెదడు , వెన్నుపూస , నాడీ వ్యవస్థ్ద అత్యంత ముఖ్యమైనవి ,మెదడు ,నరాలు కండరాలకు సంబంధించిన జబ్బులు ఎదో ఓక సమయంలో ఇబ్బంది పెడుతుంటాయన్నారు.
పక్షవాతం ,మూర్చ వ్యాధి ,స్పాండైలోసీస్ సమస్యలు ,మెదడులో కణతులు ,యాక్సిడెంట్లు ,మెదడు వాపు వ్యాధి ,న్యూరోపతి జబ్బులు ,మానసిక వ్యాధులు ప్రస్తుతం బాగా ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. ఇలాంటి సమస్యలను ఓకే చికిత్స అందించేందుకు కామినేని ఆసుపత్రిలో అడ్వాన్స్ న్యూరో సెంటర్‌ను ప్రారంభించామని తెలిపారు. ఈ చికిత్సలో భాగంగా ముగ్గురు నిష్ణాతులైన న్యూరాలజిస్టులు ,ముగ్గురు న్యూరో సర్జన్లు ,ముగ్గురు సైకియాట్రిస్టులు ,ఇద్దరు న్యూరోక్రిటికల్ కేర్ వైద్యులు, న్యూరో రేడియాలజిస్ట్‌లు ఓక టీమ్‌గా ఏర్పడి 24 గంటలు 7 రోజలు సేవలు అందిస్తామని తెలిపారు.