Saturday, November 23, 2024

మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట: మహిళామణులకు చేయూతగా, వారికి అన్ని విధాలుగా అండగా నిలబడే విధంగా మహిళల సాధికారతకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్దపీట వేశారని ప్రభుత్వ విప్, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భా గంగా మహిళా సంక్షేమ దినోత్సవం కార్యక్రమాని కి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు, గర్భిణీలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు ము ఖ్యమంత్రి కెసిఆర్ అందిస్తున్నారని అన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా 18 లక్షల 46 వేల 635 మంది మహిళలకు లబ్ధి చేకూరిందని, అదే విధ ంగా ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా గర్భిణీలకు, బా లింతలకు పౌష్టికాహారం అందిస్తున్న ఏకైక ప్రభు త్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. మహిళల భద్ర తా చర్యలు చేపట్టేందుకు షీ టీమ్స్, భరోసా, సఖి కేంద్రాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.

అంగన్వాడి, ఆశా కార్యకర్తల జీతాలు పె ంచి వారి జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమానికి సంబంధించి దేశాంలోనే విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టిందని, పిల్లలు, తల్లులో పోషణ లోపం లేకుండా చేయడానికి వివిధ చర్యలు తీసుకోవడం లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు. అదే విధంగా కెసిఆర్ న్యూట్రిషన్ కిట్స్ ద్వా రా 6.84 లక్షల మంది గర్భిణీలకు లబ్ధి చేకూరిందని, కెసిఆర్ కిట్ పథకం ద్వారా 13 లక్షల 90 వే ల 636 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి కెసిఆ ర్ అండగా నిలిచారన్నారు.

కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డల పెళ్ళికి భారం కాకుం డా తెలంగాణ ప్రభుత్వం వారికి లక్షా 116 సాయ ంగా అందిస్తుందన్నారు. అంతకు ముందు ఆటపాటలు, బతుకమ్మలతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గు వ్వల బాలరాజ్‌కు మహిళలు స్వాగతం పలికారు. అనంతరం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పాల్గొన్న మహిళలకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భోజనా న్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారి డిఎఫ్‌ఓ రోహిత్ గోపిడి, ఎంపిపి లోక్య శాంతి భా య్ నాయక్, ఐసిడిఎస్ సిడిపిఓ అధికారులు, స్థాని క నాయకులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు అధి క సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News