Monday, December 23, 2024

మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్దపీట

- Advertisement -
- Advertisement -
  • చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్లరూరల్: దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం పెద్దపీట వేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం చేవెళ్ల నియోజకవర్గస్థాయిలో చేవెళ్ల పట్టణ కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్‌లో మహిళా సంక్షేమ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలు బోనాలు, బతుకమ్మలతో ర్యాలీగా తరలివచ్చారు. మహిళ సంఘాల సభ్యులకు రూ.25 కోట్ల 67లక్షల చెక్కును మహిళలకు బ్యాంక్ లింకేజీ ద్వారా ఎమ్మెల్యే అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మహిళల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి నెంబర్‌వన్‌గా నిలిచాయన్నారు. మహిళల సురక్షణ సాధికారత స్వావలంబన సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు.

ఈ కార్యక్రమంలో డిపిఎం స్వర్ణలత, జడ్పిటిసిలు మాలతి, గోవిందమ్మ, జయమ్మ, శ్రీకాంత్, ఎంపిపిలు విజయలక్ష్మి, భవాని, శంకర్‌పల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, వైస్ ఎంపిపి కర్నె శివప్రసాద్, తహసీల్దారులు శ్రీనివాస్, ఆశోక్, ఎంపిడిఒలు రాజ్‌కుమార్, వెంకయ్య, డిటి రాజశేఖర్, ఏవోలు తులసీ, రాగమ్మ, ఏఈ గీత స్రవంతి, ఆర్. రాజేశ్, మండల పార్టీ అధ్యక్షులు ప్రభాకర్, సర్పంచులు బండారు శైలజా, శ్రీనివాస్, మార్కెట్ కమిటీచైర్మెన్ వెంకట్‌రంగారెడ్డి, వైస్ చైర్మెన్ నర్సింలు, డైరెక్టర్లు కృష్ణ, వెంకటేష్, మహేశ్, నాయకులు రవీందర్, తోట చంద్రశేఖర్, నర్సింలు, చంద్రకాంత్, రవికాంత్, ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు, వివిధ పాఠశాలల విద్యార్థులు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News