Friday, December 20, 2024

మహిళలు ఆర్థికంగా అభివృద్ది సాధిస్తేనే దేశం ముందుకు వెళ్తుంది

- Advertisement -
- Advertisement -
  • మహిళా సంక్షేమానికే యాభై శాతం రిజర్వేషన్లు: కలెక్టర్ హరీశ్

షాద్‌నగర్: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించినప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధ్ది సాధించేందుకు వీలుంటుందని, ఇందుకోసమే ముఖ్యమంత్రి కెసిఆర్ అభ్యున్నతి కోసం యాభై శాతం రిజర్వేషన్ కల్పించారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ అన్నారు. మంగళవారం షాద్‌నగర్‌లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా షాద్‌నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్, జడ్పివైస్ చైర్మెన్ ఈట గణేష్, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అంతకుముందు జిల్లా కలెక్టర్‌కు మహిళా సంఘాల సభ్యులు బతుకమ్మతో ఘనంగా స్వాగతం ఫలికారు.

ఈ సందర్భంగా కలెక్టర్ హరిష్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధ్ది సాధించినప్పుడే దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల మహిళా సంఘాల సభ్యులకు రూ.25.88 కోట్ల చెక్కును కలెక్టర్ అందజేశారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు, భద్రతకు, అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. అప్పుడే జన్మించిన మహిళ నుండి పండు మహిళ వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకువచ్చి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాతే ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారని వివరించారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నాయని, పావలా వడ్డీకే మహిళా సంఘాలకు రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ప్రాధాన్యత కల్పించడంతోపాటు 50 శాతం రిజర్వేషన్ కల్పించినట్లు పేర్కొన్నారు. పురుషులతో సమానంగా మహిళలను అన్ని రంగాల్లో తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.

షాద్‌నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని గుర్తు చేశారు. ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్న సంకల్పంతో తక్కువ సమయంలో రుణాలు ఇప్పిస్తున్నామని, బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తున్నారంటే కేవలం మహిళా సంఘాల సభ్యులేనని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందని, ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే విధంగా సిబ్బంది చర్యలు తీసుకోవాలని తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు తాండ్ర విశాల శ్రావణ్‌రెడ్డి, ఎమ్మె శ్రీలత సత్యనారాయణ, బంగారు స్వరూప, వెంకట్‌రాంరెడ్డి, మార్కెట్ కమిటి చైర్ పర్సన్ మన్నె కవిత నారాయణ, ఎంపిపి ఇద్రీస్, ప్రియంక శివశంకర్ గౌడ్, మున్సిపల్ చైర్మెన్ నరేందర్, కమీషనర్ వెంకన్న, తహశీల్దార్ గోపాల్, ఎంపిడిఓ వినయ్‌కుమార్, ఐసిడిఎస్ అధికారిని నాగమణితోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News