Friday, December 20, 2024

చింతకాని ఎంపిడిఒకు కలెక్టర్ గౌతమ్ పరామర్శ

- Advertisement -
- Advertisement -

చింతకాని : చింతకాని మండలం ఎంపిడిఒగా విధులు కొనసాగిస్తున్న తేలూరి శ్రీనివాసరావుని జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ మంగళవారం కిమ్స్ హాస్పిటల్ లో పరామర్శించారు. సోమవారం రాత్రి విధులు నిర్వహించి ఇంటికి వెళ్తున్న సమయంలో నూతన కలెక్టర్ సమీపంలో శివ దాబా ఎదురుగా స్కూటీపై ముందు వెళ్తున్న ఇద్దరు బాలికలు ఒకేసారి యూటర్న్ తీసుకొని స్కూటీ ఆపడంతో వెనక వస్తున్న ఎంపిడిఒ కారు డ్రైవర్ వారిని కాపాడబోయి కారుని సైడ్‌కి కట్ చేయగా ప్రహరి గోడకు తగిలి కారు ప్రమాదం జరిగింది.

ఇందులో ఎంపిడిఒకి తలపై మొహంపై బలమైన గాయాలు ఏర్పడ్డాయి. చికిత్స నిమిత్తం ఖమ్మం కిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన ఆయనను జిల్లా కలెక్టర్ విపి.గౌతం పరామర్శించారు. సందర్భంగా ఎంపిడిఒకు కలెక్టర్ గౌతమ్ భయపడకు అని ధైర్యం చెప్పి, నేనున్నానంటూ ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి మంచి చికిత్స అందించాలని అట్లాగే స్కూటీపై వెళ్తు గాయపడిన బాలికలకు కూడా ఇదే హాస్పిటల్‌లో ఉన్నారని వారికి కూడా మంచి వైద్యం అందించి వారిని కాపాడాలని డాక్టర్లతో మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News