యాదాద్రి భువనగిరి: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వపాఠశాలల అభివృద్ధి ్దకోసం చేపట్టిన మనఊరు- మనబడి పథకం అధ్బుతంగా వుందని కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరి అమర్‌ప్రీత్‌దుగ్గల్ అన్నారు. భూదాన్‌పోచంపల్లి మండలంలోని భీమనపల్లి గ్రామంలో ప్రభుత్వం మనఊరు -మనబడి పథకం ద్వార ఆధునీకరించబడిన ప్రభుత్వపాఠశాలను మంగళవారం కేంద్ర విద్యాశాఖ డిప్యుటిసెక్రటరి సుధామీన, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, జిల్లా కలెక్ట్టర్ పమేలా సత్పతిలతో కలిసి పరిశీలించారు.
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న విధ్యాబోధన విధానం, మద్యాహన్న బోజనం, పాఠ్యపుస్తకాల పంపిణీ, పాఠశాల నిర్వహణ తీరు తెన్నులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు భీమనపల్లిలో ప్రభుత్వపాఠశాలను సందర్శించినట్లు ఆమె తెలిపారు. కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా పర్నీచర్, మౌలిక వసతులు ప్రభుత్వపాఠశాలలో కల్పించి గ్రామాల్లో ప్రజలు తమపిల్లలను ప్రభుత్వపాఠశాలల్లో చేర్పించేలా కృషి చేస్తున్న సర్పంచు కంటె రాములు, ఎఎంసి సభ్యులను ఆమె అభినందించారు.
ఈకార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దీపక్‌తివారీ, డిఈఓ నారాయణ్‌రెడ్డి, టెక్నికల్ అధికారి ఇంద్రజీత్‌వత్స, వెంకటనర్సమ్మ, వైస్ ఎంపిపి పాకవెంకటేష్, ఎఎంసి చైర్మన్ నాంపల్లి వెంకటేష్, ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి స్కూల్ అధ్యాపకులు తదితరులు వున్నారు.