- Advertisement -
పదర : భూమి కోసం మారణాయుధాలతో దాడి చేసుకున్న సంఘటన సోమవారం రాత్రి నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండల పరిధిలోని మద్దిమడుగు గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మద్దిమడుగు గ్రామ శివారులోని సర్వే నెంబర్ మూడులో 18 ఎకరాల భూమిని వీరాంజనేయులు అనే వ్యక్తి సాగు చేస్తున్నాడని అదే గ్రామానికి చెందిన ముప్పాళ్ళ వెంకటయ్య, చిన్న వెంకటయ్య, చెన్నయ్య, డేవిడ్ అనే కొంత మంది భూమి మాది, మా భూమిని మీరెలా సాగు చేస్తారంటూ వీరాంజనేయులుపై మారణాయుధాలతో దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నామని తెలిపారు.
- Advertisement -