Saturday, November 23, 2024

మహిళ సంక్షేమంలో తెలంగాణదే అగ్రస్థానం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో దూసుకుపోతుందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామంలో గల టిసివి రెడ్డి ఫంక్షన్ హాలులో పాలేరు నియోజకవర్గ స్థాయి తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అనంతరం ఐకెపి ఎపిఎం పిడమర్తి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కందాళ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలలో కూడా మహిళలకు పెద్దపీఠ వేస్తున్న సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ మహిళల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన చేస్తున్న సిఎం కెసిఆర్ గొప్ప మనసున్న నేతని కొనియాడారు. అంగన్వాడి బడులలో కరెంటు లైట్లు ఫ్యాన్లు త్వరిత గతిన ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కోరారు. పాలేరు నియోజకవర్గం లో ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో రానున్న పది రోజుల్లో చిన్నపిల్లలకు ప్లేట్స్ పంపిణీ చేయడం జరుగుతుందని అంగన్వాడీ టీచర్లు పిల్లలకు అందించాలన్నారు.

గ్రామాలలో అంగన్వాడీలు చేస్తున్న సేవలు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నాయని వారి సేవలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో మరల సంక్షేమ పథకాలు అందరికీ ఇలానే అందాలంటే, మరొకసారి సిఎం కెసిఆర్ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెట్టాలంటే అది సిఎం కెసిఆర్‌తోనే సాధ్యమవుతుందని, ఎన్నికల రాగానే కొత్త బిచ్చగాళందరూ వస్తారని అవన్నీ గమనించాలని, నిత్యం ప్రజల కోసం పనిచేసే బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మరొకసారి ఎన్నుకోవాలన్నారు. ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్ మాట్లాడుతూ మహిళలు అనేవారు లేకుండా ఉంటే మనగడే లేదని, మహిళలకు ఓర్పు సహనం ఎంతగానో ఉంటుందన్నారు.

తెలంగాణ రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేసి చివరకు ప్రాణాలు ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు సిఎం కెసిఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా మహిళలపై దాడులు జరగలేదని, ఇందుకు నిదర్శనం సిఎం కెసిఆర్ పరిపాలనేనని, ప్రతి ఒక్కరూ గమనించాలని తెలిపారు. 2014 ముందు అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ దీపికలు జీతాలు పెంచండి అని సచివాలయం ముందు ధర్నాలు చేస్తే ఆ రోజు ఉన్న ప్రభుత్వాలు గుర్రాళ్ళతో తొక్కించి లాఠీ చార్జీలు చేసిన ఘనత అప్పటి దుర్మార్గవంతమైన ప్రభుత్వాలదేనని అన్నారు.

ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా మహిళలపై లాఠీ చార్జీలు జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. ఎన్నో సంవత్సరాల ప్రజలకు సర్వీసు చేస్తున్న అంగన్‌వాడీలు ఆశా వర్కర్లు, గ్రామ దీపికలు అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు సరైన వేతనం ఇవ్వకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వారికి వేతనాలు పెంచి అన్ని విధాలుగా అండగా ఉండటంతో వారి కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉంటున్నాయని అన్నారు. ఇలాంటి గొప్ప గొప్ప పనులు చేస్తున్న సిఎం కెసిఆర్‌కు ప్రతి ఒక్కరు రుణపడి ఉంటారని, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకం అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కి దక్కుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ రావు, రూరల్ మండలం ఎంపిపి బెల్లం ఉమ, జడ్పిటిసి యండపల్లి వరప్రసాద్, రూరల్ మండలం తహాసిల్దార్ సుమ, ఏసీపి బస్వారెడ్డి, సుడా డైరెక్టర్ గూడా సంజీవరెడ్డి, డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్, జడ్పిటిసి ఇంటూరి బేబి, ఎంపిపి శ్రీనివాస్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, ఎంపిడిఒ అశోక్ కుమార్, నియోజకవర్గంలో నాలుగు మండలాల ఎంపిపిలు, జడ్పీటీసీలు, రైతుబంధు అధ్యక్షులు, సొసైటీ చైర్మన్లు, ఎంపిడిఒలు తహసీల్దార్‌లు, డిసిసిబి డైరెక్టర్లు పలువురు ఇతర నేతలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News