హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా పశ్చిమదిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయి . వీటి ప్రభావంతో మూడు రోజులపాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. మరో వైపు పలు జిల్లాల్లో వడగాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. అదిలాబాద్ , ఖమ్మం , ములుగు , కొమరంభీం, మంచిర్యాల, నల్లగొండ, కొత్తగూడెం, సూర్యాపేట, భూపాలపల్లి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. మంగళవారం కొమరంభీం జిల్లా జంబుగలో అత్యధికంగా 44.8డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లో తంగుళ్లలో 44.5, దామరచర్లలో 44.1, మునగాలలో 44,ఖానాపూర్‌లో 43.9, ధర్మాసాగర్‌లో 43.9, గార్లలో 43.9, అశ్వారావుపేటలో 43.9, పులకుర్తిలో 43.8, ముత్తారంలో 43.8డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరో మూడు రోజులు తెలికపాటి వర్షాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -