ఏన్కూరు : కెసిఆర్ సారథ్యంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేశారని వైరా శాసన సభ్యులు లావుడ్యారాములు నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో భాగంగా వైరా నియోజకవర్గ స్థాయి మహిళా సంక్షేమ దినోత్సవం సిడిపిఓ, ఐకెపి వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత లావుడ్యా రాములునాయక్ మహిళలు మేళతాళాలతో, కోలాటాల, నృత్యాలతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
ప్రత్యేక విశిష్ట అతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత ఐఎఎస్ మహిళా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం లావుడ్యా రాములునాయక్ మాట్లాడుతూ మహిళలకోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సిఎం కెసిఆర్‌దే అన్నారు. వనితలకు వరప్రదాయిని, ఆరోగ్య మహిళ, మహిళ సాధికారిక బలం, షీ టీమ్స్, షీ క్యాబ్స్ లాంటి మహిళా పథకాలను ప్రవేశపెట్టారన్నారు.
ఈ కార్యక్రమంలో వైరా మాజీ ఎంఎల్‌ఎ బాణోత్ చంద్రావతి, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఐదు మండలాల గౌరవ ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ అధికారులు, ఎంపిపిలు, జడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు, మార్కెట్ కమిటీ చైర్మన్, అంగన్‌వాడీ సభ్యులు, గ్రామదీపికలు తదితరులు పాల్గొన్నారు.