- కఠిన నిర్ణయం తీసుకున్న కన్న తల్లీదండ్రులు
- అడ్డుకున్న బాల పరిరక్షణ బృందం
సిద్దిపేట: ఆడపిల్ల పుట్టిందని 24 గంటలు గడవకముందే ఆ పాపను 20 వేల రూపాయలకు బజారులో అమ్మకానికి పెట్టిన ఓకఠిన తల్లిదండ్రులు. వివరాల్లోకి వెళితే సిద్దిపేట అ ర్బన్ మండలం బూర్గుపల్లి గ్రామ శివారులో ఒక్కరోజు వయసు గల ఆడ శిశువును 20 వేల రూపాయలకు విక్రయిస్తున్నారని నమ్మదగిన సమాచారం రావడంతో బాలల పరిరక్షణ విభాగం అధికారులు ప్రొటెక్షన్ ఆఫీసర్ రాజు శిశు గృహ మేనేజర్ ఝాన్సీ శిశు గృహ సామాజిక కార్యకర్త రాజారాం వెంటనే బాల రక్షక వాహనంలో విక్రయిస్తున్న స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. మిరుదొడ్డి మండలం మోతే గ్రామానికి చెందిన గొడుగు మంజుల తన ఒక్కరోజు వయసుగల పాపని గజ్వేల్ లో నివాసం ఉంటున్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎండి జామిన్ మరియు ముంతాజ్ దంపతులకు విక్రయించడానికి నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల గొడుగు మంజుల భర్త అనారోగ్యంతో మరణించాడు. మరియు ఈ పాప నాలుగో సంతానం కావడంతో పోషించలేక అమ్ముతున్నాను అని మంజుల, ఆమె సన్నిహితులు దగ్గరి బంధువులు చెప్పినట్లు బాల పరిరక్షణ స భ్యులు తెలిపారు. డిసిపియు బృందం ఈ విషయాన్ని సిడబ్ల్యుసి కి సమాచారం అందించినట్లు వారు తెలిపారు. రెస్క్యూ చేసి పాపను వైద్య పరీక్షల నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు. ఇలాంటి పోషించలేని ప రిస్థితుల్లో ఉన్నవారు పిల్లలను జిల్లా బాలల పరిరక్షణ విభాగం కు అప్పగించిన చో వారి సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వం తీసుకుంటుందని, అదేవిధంగా పిల్ల లు లేని దంపతులు ఎట్టి పరిస్థితులలోనూ పిల్లలను అక్రమంగా తీసుకోకూడదని పరిరక్షణ సభ్యులు తెలిపారు. ఒకవేళ తీసుకున్న యెడల మానవ అక్రమ రవాణా చట్టం క్రింద శిక్షార్హులు అని జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాము అన్నారు.