Saturday, December 21, 2024

మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవాలి: ఈఎన్‌సి కృపాకర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రంలోని మిషన్ భగీరథ కార్యాలయాలు, నీటి శుద్ధి కేంద్రాల్లో మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఎర్రం మంజిల్ లోని మిషన్ భగీరథ కేంద్ర కార్యాలయంలో మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈఎన్ సి కృపాకర్ రెడ్డి మహిళా ఉద్యోగులు,సిబ్బందికి ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరం ప్రారంభించారు. స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అనంతరం మిషన్ భగీరథ మహిళ ఉద్యోగులు, సిబ్బందికి క్విజ్, క్యారమ్స్ ,రంగోలి, మ్యూజికల్ చైర్ తో పాటు వివిధ రకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News