హైదరాబాద్ : మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్, టెమ్రీస్ కార్యదర్శి బి. షఫిఉల్లాను వివిధ మైనారిటీ విభాగాల అధికారులు ఘనంగా సన్మానించారు. మంగళవారం సాయంత్రం హజ్‌హౌస్ ప్రాంగణంలో తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు, తెలంగాణ హజ్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ల ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. షఫివుల్లా ఈ నెల 20న హజ్ కు వెళ్తున్న సందర్భంగా ఈ సత్కారం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు షఫిఉల్లాకు శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్, షఫిఉల్లాకు పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను అభినందనందించారు. హజ్ కమిటీ చైర్మన్ మొహమ్మద్ సలీం, వక్ఫ్ బోర్డు చైర్మన్ మసిఉల్లా ఖాన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఖాజా ముజీబుద్దీన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి ఎ. కాంతి వెస్లీ, వక్ఫ్‌బోర్డు సిఈఓ ఖాజా మొయినుద్దీన్, టిఎన్‌జిఓస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎస్‌ఎమ్ హుస్సేని ముజీబ్, ఉర్దూ అకాడమి సూపరింటెండెంట్ వి. క్రిష్ణ, మైనారిటీ కమిషన్ సభ్యులు అథరుల్లా, బిఆర్‌ఎస్ సీ.నియర్ నాయకుడు ఖాజా బద్రుద్దీన్, హజ్ కమిటి సభ్యులు , అధికారులు, సిబ్బంది హజ్‌కు వెళుతున్న షఫిఉల్లాకు శుభాకాంక్షలు తెలిపారు. పూలమాలలు వేసి సత్కరించారు.
మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ షఫిఉల్లాకు సన్మానం
- Advertisement -
- Advertisement -
- Advertisement -