Monday, December 23, 2024

రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి : సుభాష్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

చర్లపల్లి: రాష్ట్రంలో మహిళల సంక్షేమం అభ్యున్నతి కో సం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అ న్నారు. మంగళవారం కాప్రా డివిజన్ మహిళా అధ్యక్షురాలు గిరుకబావి సురేఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నివాసంలో సుభాష్‌రెడ్డిని మర్యాదపూర్వకం గా కలిశారు. కాప్రా డివిజన్‌లో మహిళా భవన్ నిర్మాంచాలని మహిళలు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. సానుకూలుంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కాలనీల్లో పాదయాత్ర చేస్తానని తెలిపారు. ఈకార్యక్రమంలో మహిళలు సరిత, సుభద్ర, యాదమ్మ, ధనలక్ష్మి,రాజ్యలక్ష్మితదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News