Sunday, December 22, 2024

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గర్భిణుల్లో పోషకాహార లోపం, రక్త హీనత లేకుండా కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. నిమ్స్‌లో జరిగే కార్యక్రమంలో సిఎం కెసిఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆరుగురు గర్భిణులకు ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా కిట్స్ అందజేస్తారు. కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం మొదటి దశలో 9 జిల్లాల్లో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో పంపిణీ ప్రారంభం కాగా, మిగతా 24 జిల్లాల్లో పంపిణీ బుధవారం ప్రారంభం కానున్నది.

ఈ కిట్‌లో మొత్తం 7 రకాల వస్తులు ఉంటాయి. కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, కిలో ఖర్జూర, మూడు ఐరన్ సిరప్ బాటిళ్లు, అరకిలో నెయ్యి, 200 గ్రాముల పల్లిపట్టి, ఒక కప్పు, ప్లాస్టిక్ బాస్కెట్ కలిపి కిట్ రూపంలో అందిస్తారు. రెండు, మూడో ఎఎన్‌సి చెకప్‌ల సమయంలో కెసిఆర్ న్యూట్రిషన్ కిట్స్‌ను అందజేస్తారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6.8 లక్షల మంది గర్భిణులకు ప్రయోజనం కలుగనున్నది. ఇందుకోసం బడ్జెట్‌లో సిఎం కెసిఆర్ రూ.250 కోట్లు కేటాయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News