Thursday, January 23, 2025

ఇసెట్‌లో 93.07 శాతం ఉత్తీర్ణత

- Advertisement -
- Advertisement -
ఫలితాలు విడుదల చేసిన చైర్మన్ లింబాద్రి

హైదరాబాద్ : రాష్ట్రంలో పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు లాటరల్ ఎంట్రీ ద్వారా బి.టెక్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన టిఎస్‌ఇసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. గత నెల 20వ తేదీన జరిగిన ఇసెట్ పరీక్షకు మొత్తం 22,454 మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 20,889 మంది(93.07 శాతం) ఉత్తీర్ణత సాధించారు. టిఎస్‌ఇసెట్ ఫలితాలను మంగళవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డి.రవీందర్ యాదవ్, ఇసెట్ కన్వీనర్ శ్రీరాం వెంకటేశ్‌లు మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వి.వెంకటరమణ, కార్యదర్శి ఎన్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాలిటెక్నిక్, బిఎస్‌సి (గణితం) పూర్తిచేసిన విద్యార్థులకు ఇసెట్ ర్యాంకుల ఆధారంగా బి.టెక్ కోర్సుల్లో ల్యాటరల్ ఎంట్రీ (రెండో సంవత్సరంలో) ప్రవేశాలు కల్పిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News