Saturday, November 16, 2024

ఉద్యోగుల ప్రయోజనాల కోసం సుజిత్‌గాంధీ పోరాటం అభినందనీయం

- Advertisement -
- Advertisement -

గోషామహల్: సాక్స్ ఉద్యోగులకు ప్రయోజనాలు సాధించడంతో సుజిత్ గా ంధీ చేస్తున్న కృషి అభినందనీయమని పబ్లిక్ హెల్త్ మెడిక ల్ ఎంప్లాయిస్ యూనియన్ (31 94 ఐఎ న్‌టియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆలిండియా ఎయిడ్స్ కంట్రోల్ ఎంప్లాయి స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఎఐఎసిఇడబ్లుఎ) అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆర్ సుజిత్‌గాంధీని సంఘం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్ర మంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బి వెంకటేశ్వర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని సుజిత్ గాంధీని పూలమాల, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సాక్స్ ఉద్యోగుల హక్కుల సాధనకు సుజిత్‌గాంధీ చేస్తున్న నిర్విరామ పోరాటం ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుజిత్‌గాంధీ ఆలిండియా ఎయిడ్స్ కంట్రో ల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం మనందరికీ గర్వకారణమంటూ సుజిత్‌గాంధీని అభినందిం చారు. సన్మాన గ్రహీత, అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు ఆర్ సుజిత్‌గాంధీ మాట్లాడుతూ ఎయిడ్స్ కంట్రోల్ అసోసియేషన్ సభ్యుల హక్కుల సాధ న, సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తానన్నారు. సభ్యుల సంక్షేమమే లక్షంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులందరి అభిప్రాయా లు, సూచనలు, సలహాలకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతామన్నారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుం టూ, సంబంధిత అధికారులతో చర్చించి ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి చొరవ తీసుకుంటానని అన్నారు.

తనపై నమ్మకంతో జాతీయ అధ్య క్షులుగా ఎన్నుకున్న అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ నమ్మకాన్ని నిజం చేసేందుకు, ఉద్యోగులు అందరి సహకారంతో జాతీ య అధ్యక్ష పదవీ బాధ్యతలను సమర్దవంతంగా నిర్వర్తించేందుకు 24/7 పని చేస్తానని హామీనిచ్చారు. అనంతరం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఉద్యోగులు సుజిత్‌గాంధీని పూలమాల, శాలువాలతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్చాలు, జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్, తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ ఎంప్లాయిస్ నాయకులు శంకర్, శ్రీనివాస్, నరేష్, స్వర్ణమంజరి, శంకర్, బాబు, శ్రీలత, ఖాదరుద్దీన్, నాగశ్రీ, విద్యా రెడ్డి, సోమన్న, భూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News