Saturday, November 16, 2024

మహిళ సంక్షేమానికే మొదటి ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని చేవెళ్ల ఎంపి డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. ఆడపడుచు కంట్లో కన్నీళ్లు రావద్దని కొనుకునే మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని వారు కొనియాడారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించి మహిళ సంక్షేమ దినోత్సవ వేడుకలో వారు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎంపి రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ పెళ్లి ఈడుకు వచ్చిన ఆడ పిల్ల ఉన్న కుటుంబం గతంలో ఎదపై మంటగా బావించేవారని గుర్తు చేశారు.

కానీ ప్రతి పేదింటి ఆడపిల్ల సంతోషంగా పెళ్లి చేసుకోవడంతో పాటు తల్లిదండ్రులకు ఆర్థిక భారం కావదన్న మంచి ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను ఆదుకుంటున్నారని చెప్పారు. మహిళ, శిశు సంక్షేమంలో రాష్ట్రం మందజలో ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత ప్రసవాలు, పుట్టిన బిడ్డకు కేసీఆర్‌కిట్ అందజేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. అంగన్‌వాడీ పిల్లలకు పౌష్టిక ఆహారం , ఆరోగ్యకరమైన వాతావరణంలో వారి ఎదుగుదల కోసం అనే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.

భర్త మరణించిన మహిళలను ఆర్థిక అండగా వింతంతు పిచన్లు, వయోవృద్ద మహిళకు వృద్ధాప్య పింఛన్లు ప్రభుత్వం అందిస్తుందన్నారు. రానున్నకాలంలో కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళ సంక్షేమానికి మరింత పెద్దపీట వేయనుందని చెప్పారు. ఈకార్యక్రమంలో బండ్లడూడ మేయర్ మహేందర్‌గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్‌రెడ్డి, నార్సింగి మునిసిపల్ చైర్ పర్సన్ రేఖ, జడ్పిటీసీ తన్విరాజ్, ఎంపిపి జయమ్మ, పలువురు ఎంపిటీసీలు, సర్పంచ్‌లతోపాటు రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ పలు మహిళా సంఘాల నాయరాళ్లు, ఆశావర్కర్లు, అంగన్‌వాడి ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News