Monday, December 23, 2024

కొనసాగుతున్న స్కూల్ బస్సుల తనిఖీలు

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్ : నిబంధనలు ఉల్లంఘించి పాఠశాల బస్సుల పై ఆర్టీఏ అధికారుల దాడుల పరంపర కొనసాగుతోంది. రవాణ శాఖ పరిధిలోని రాజేంద్రనగర్ అత్తాపూర్, కొండాపూర్, శంషాబాద్, మెడ్చేల్ , ఇబ్రహీంపట్నం ఆర్టీవో కార్యాలయ పరిధిల్లో అధికారులు మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో పలు నిబంధనలు ఉల్లఘించిన పాఠశాల విద్యార్థులను తరలించే బస్సులు వెలుగు చూసాయి. జిల్లా రవాణశాఖ అధికారు స్పెషల్ డ్రైవ్‌లో వివిధ ప్రాంతాలలో సరైన అనుమతులు, కండీషన్ లేని బస్సులను గుర్తించి సీజ్ చేసినట్లు డిటిసి ప్రవీణ్‌రావు తెలిపారు.

ఈసందర్భంగా ఆయన ఫిట్ నెస్, ఇన్సూరెన్స్ , పర్మిట్, పొల్యూషన్ లేని బస్సులను రోడ్ల పై తిప్పడానికి, విద్యార్థుల రవాణకు అనుమతిచ్చేది లేదని చెప్పారు.కొందరు ఇష్టానుసారంగా వాహనాలను రోడ్ల పై తిప్పుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడాలని ప్రత్నిస్తే కఠిన చర్యలు తప్పని, భారీ జరిమానాలు విధిస్తామన్నారు. ప్రతి స్కూల్ బస్సులో ఫస్ట్ ఎయిడ్ కిట్,ఫైర్ సెఫ్టి కిట్ ఉంచాలని సూచించారు. దాంతో పాటు వాహన నడిపే వ్యక్తులు తప్పిన సరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, భారీ బస్సుల డ్రైవర్లకు హెవీ లైసెన్స్ తప్పని సరి అని చెప్పారు. 60 ఏళ్లు దాటిన డ్రైవర్లు స్కూల్ బస్సులు నడపవద్దని సూచించారు. ఈ దాడుల్లో సీనియర్ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సురేందర్‌రెడ్డి, మోటర్ వేహికల్ ఇన్‌స్పెక్టర్లు విజయ్‌రావు, వాసు, రాధిక తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News