Saturday, December 21, 2024

భార్య, ముగ్గురు కూతుళ్ల గొంతు కోసి… ఉరేసుకున్న భర్త

- Advertisement -
- Advertisement -

పాట్నా: భార్య, ముగ్గురు కూతుళ్ల గొంతు కోసి హత్య చేసిన సంఘటన బిహార్ రాష్ట్రం ఖగారియా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఎకానియా గ్రామంలో మున్నా యాదవ్, పూజా దేవి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. బుధవారం రాత్రి మున్నా యాదవ్ తన భార్య పూజాతో గొడవకు దిగాడు. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో పదునైనా ఆయుధంతో దాడి చేయడానికి ప్రయత్నించడంతో ఆమె తప్పించుకుంది. వెంటనే ఇద్దరు కూతుళ్ల గొంతు కోశాడు.

Also Read: రాష్ట్రంలో మరో 17 బిసి గురుకుల డిగ్రీ కాలేజీలు

అనంతరం భార్యను పట్టుకొని ఆమె గొంతు కూడా కోశాడు. మరో కూతురు గొంతు కూడా కోశాడు. రాత్రి ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య జరిగింది. ఇద్దరు కుమారుడు అతడి నుంచి తప్పించుకొని దూరంగా పారిపోయాడు. వెంటనే మున్నా ఇంటి వెనక ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీస్ అధికారి కుమార్ తెలిపాడు. ముగ్గురు కూతుళ్లు సుమన్ కుమారీ(18), అంచల్ కుమారు(16), రోష్ని కుమారీ(15)గా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News