Saturday, December 21, 2024

ప్రైవేట్ సంస్థకు భూ యజమానుల వివరాలు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వెనక ఎన్నో అక్రమాలు ఉన్నాయని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్ ను ప్రైవేట్ సంస్థకు అప్పగించారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ధరణిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ సంస్థ నిర్వహిస్తోందన్నారు.

ప్రజల భూముల వివరాలన్నింటినీ ప్రైవేట్ సంస్థ చేతిలో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 లక్షల భూ యజమానుల వివరాలను ఐఎల్ఎఫ్ సంస్థకు విక్రయించారని రేవంత్ ఆరోపించారు. ఐఎల్ఎఫ్ అనే సంస్థ వివిధ బ్యాంకులను రూ. 90వేల కోట్లకు ముంచిందని రేవంత్ ఆరోపించారు. దివాళా తీసిన ఐఎల్ఎఫ్ సంస్థతో ప్రభుత్వం ఒప్పదం చేసుకుందన్న రేవంత్ రెడ్డి ఐఎల్ఎఫ్ సంస్థలో ఫిలిప్పీన్స్ కు చెందిన కంపెనీ పెట్టుబడులున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News