Monday, December 23, 2024

‘లవ్ యూ రామ్’ నుంచి ‘మనసు మాట వినదే’ లిరికల్

- Advertisement -
- Advertisement -

క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ లతో ఆకట్టుకున్న దర్శకుడు కె దశరథ్ అందిస్తున్న కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ యూ రామ్’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. డివై చౌదరి, కె దశరధ్ కలిసి మన ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ చక్ర ఫిలింస్ బ్యానర్‌ లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాట కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ చిత్రం నుంచి ‘మనసు మాట వినదే’ పాటని కింగ్ నాగార్జున లాంచ్ చేశారు.కె వేద ఈ పాటని లవ్లీ మెలోడీగా కంపోజ్ చేయగా.. దివ్య మాలిక శ్రావ్యంగా అలపించారు. వరికుప్పల యాదగిరి సాహిత్యం అందించిన ఈ పాటలో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ అందంగా వుంది. సుధాకర్ బొర్రా (టేనస్సీ), డి నాగేశ్వర్ రావు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ గోపు, శివ మొక్క స్క్రీన్ ప్లే అందించారు. ప్రవీణ్ వర్మ మాటలు రాశారు. సాయి సంతోష్ కెమెరామెన్ గా, ఎస్.బి ఉద్ధవ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News