Monday, December 23, 2024

వైద్య శాఖ సేవలు మరువలేనివి

- Advertisement -
- Advertisement -

మధిర : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మధిర నియోజకవర్గ స్థాయి వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని బుధవారం మధిర పట్టణ కేంద్రంలో గల పివిఆర్ గార్డెన్‌లో జరుపుకున్నారు. కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ వైద్యరంగం తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందిందని జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ, కార్డియాలజీ విభాగాలు, డయాలసిస్ సెంటర్లు, మాతా శిశు హాస్పిటల్, జిల్లా కేంద్రాలలో అన్ని రకాల స్కానింగ్లు టెస్టులు, కరోనా లాంటి మహమ్మారి విపత్తులో రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, అదేవిధంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రజలకు కంటి పరీక్షలు చేయించి సంబంధిత అద్దాలను అందించిన మహనీయుడు కెసిఆర్ అని మన మధిర నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రి శిథిలావస్థ స్థితిలో ఉండడంతో వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రివ కల్వకుంట్ల చంద్రశేఖర రావుది అని ఇలాంటి ప్రజా సంక్షేమ ప్రభుత్వానికి మనమందరం అండగా ఉండాలన్నారు.

అనంతరం వైద్య రంగంలో వివిధ విభాగాలలో ఉత్తమ సేవలు అందించిన వారికి మెమొంటో అందజేసి అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి గర్భిణీ స్త్రీలకు విటమిన్స్ పోషకాహారాలు గల న్యూట్రిషన్ కిట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న డాక్టర్లు వైద్యశాఖ వారు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, బిఆర్‌ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ఏఎన్‌ఎంలు జిఎన్‌ఎమ్‌లు వివిధ విభాగాల్లో చేసే హాస్పిటల్ సిబ్బంది మొదలగువారు హాజరైయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News