Saturday, November 23, 2024

మాతా శిశు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ : మాతా, శిశు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హాలియాలోని ఎస్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన వైద్యారోగ్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లతో పాటు పుట్టిన బిడ్డలకు బాలామృతం లాంటి పౌష్టికాహారాన్ని అందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్షంగా పని చేస్తున్నట్లు తెలిపారు.

గతంలో పాలించిన నాయకులు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని హాలియాలోని ప్రా థమిక ఆరోగ్య కేంద్రాన్ని 50 పడకల ఆస్పత్రిగా అభివృద్ది చేస్తున్న సీఏం కేసీఆర్‌కు నియోజకవర్గ ప్రజలంతా అండగా ఉండాలన్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లను అందజేసి వైద్య ఆరోగ్య శాఖలో సేవలందిస్తున్న పలువురిని ఘనంగా సన్మానించారు.

కార్యక్రమ ంలో ఎంపీపీ బొల్లం జయమ్మ, మార్కెట్ చైర్మన్‌లు మర్ల చంద్రారెడ్డి, జవ్వాజి వెంకటేశ్వర్లు, పీడీ రాజ్‌కుమార్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు చేకూరి హన్మంతరావు, మాజీ మార్కెట్ చైర్మన్ యడవల్లి మహేందర్‌రెడ్డి, పిడిగం నాగయ్య, తహసీల్దార్ మంగా, చెరుపల్లి ముత్యాలు, ఎంపీటీసీ ఉర్లగొండ వెంకటయ్య, సురభి రాంబాబు, పొదిల శ్రీను, చాపల సైదులు, అన్వరుద్దీన్, దొరేపల్లి వెంకన్న, గడ్డం రమణ, ధనలక్ష్మి, కళావతి, వనజ, ముదిరెడ్డి మాధవి, గార్లపాటి ఎల్లమ్మ, రెడ్డిపల్లి జానకిరాములు, వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News