నిజామాబాద్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆర్మూర్ ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఘనగా ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం అధ్వాన్న స్థితిలో ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం అత్యాధునిక హంగులతో పురోగమిస్తూ కార్పొరేట్ స్థాయిని మించి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. తెలంగాణలో వైద్య విప్లవానికి ముఖ్యమంత్రి కెసిఆర్ కర్మ, కర్త,క్రియ అని కొనియాడారు. తొమ్మిదేళ్లలోనే వైద్య రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఎదిగిందన్నారు. తల్లీ పిల్లల సంరక్షణ కోసం 14రకాల వస్తువులతో ఇస్తున్న కెసిఆర్ కిట్ ఎంతో సత్ఫలితాలనిస్తోందన్నారు. 2014లో 30శాతం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలు గత ఏప్రిల్ నాటికి 70శాతానికి చేరుకున్నాయన్నారు. దేశంలో అత్యధిక కిడ్నీ మార్పిడులు హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయని, కంటి వెలుగు ద్వారా కోటి 60లక్షల మందికి పరీక్షలు పూర్తిచేసి, 38లక్షల మందికి కంటి అద్దాలు అందించడం తెలంగాణ ప్రభుత్వం సాధించిన అద్భుతమైన విజయమని అన్నారు. స్వరాష్ట్రంలో మొట్టమొదటి వంద పడకల ఆసుపత్రి ఆర్మూర్‌కు కేటాయిస్తూ రూ. 27 కోట్లు మంజూరు చేసినందుకు సిఎం కెసిఆర్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ ఆసుపత్రిలో ఇప్పటికే 26వేల ఉచిత ప్రసవాలు జరిగాయని, దీంతో ప్రజలకు వేలాది ఆర్థిక భారం తప్పిందని అన్నారు. కిడ్నీ పేషంట్లకు ఆర్మూర్‌లోనే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశామని, ఆర్మూర్ నియోజకవర్గం వ్యాప్తంగా 26వేల మందికి పైగా అనారోగ్య బాధి తులకు సిఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక చేయూతనందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, స్థానిక మున్సిపల్ ఛైర్‌పర్సన్ వినీత పండిత్, వైస్ ఛైర్మ న్ మున్నూబాయ్, కౌన్సిలర్లు, ఎంపిపిలు, వైద్య ఆరోగ్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఘనంగా వైద్య ఆరోగ్య దినోత్సవం
- Advertisement -
- Advertisement -
- Advertisement -