Saturday, December 21, 2024

సిఎం కెసిఆర్ చెప్పిన అబద్ధాల హామీలు..

- Advertisement -
- Advertisement -

గద్వాల: సిఎం కెసిఆర్ పర్యటనలో భాగంగా గద్వాలలో నిర్వహించిన బహిరంగ సభలో చెప్పిన అబద్ధాల హామీలపై బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు స్పందించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం గద్వాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పటేల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయంలోనే నెట్టెంపాడు ప్రాజెక్టును పూర్తి చేసి గద్వాలలో భూములకు సాగునీరందించినట్లు గుర్తు చేశారు. ర్యాలంపాడు రిజర్వాయర్ 4టీఎంసీలు పెంచింది కాంగ్రెస్ పార్టీనేని కాని సీఎం కేసీఆర్ అంతా బీఆర్‌ఎస్ ప్రభుత్వహయంలో చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుగా ఉందన్నారు. వాల్మీకిబోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తామన్నా హామీని బీఆర్‌ఎస్‌ప్రభుత్వం మరిచిందన్నారు.

గద్వాల అభివృద్దికి రూ.100కోట్లు నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించిన ఇప్పటి వరకు నిధుల ఊసే లేదన్నారు. ఏళ్లుగా శిలాఫలకానికే పరిమితమైన హ్యండ్లూపార్కు పనులు ఎందుకు చేపట్టడం లేదని, దివిసీమ ప్రజల ఆకాంక్ష తీరుస్తామని చెప్పి గుర్రంగడ్డ బ్రిడ్జీ నిర్మాణం పనులు ఎందుకు పూర్తి చేయడంలేదని ప్రశ్నించారు. గద్వాలలో మెడికల్ కాలేజి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు తరగతులు ప్రారంభిచలేదన్నారు. గత ఎన్నికల సమయంలో గద్వాలకు ఇచ్చిన హమీలను సీఎం కేసీఆర్ ఎందుకు నెరవేర్చడం లేదని, అబద్దాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టిస్తున్న సీఎం కేసీఆర్ మాటలపై ఆ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని కోరారు. ఎన్నికలు వస్తున్నాయని బీఆర్‌ఎస్ పార్టీ ఇస్తున్న అబద్దపు హమీలకు ప్రజలు మోసపోవద్దని ఓటు అనే వజ్రాయుద్దం ద్వారా బీఆర్‌ఎస్ పార్టీకి బుద్దిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. నడిగ్డడ అభివృద్ది చెందాలంటే కాంగ్రెస్‌పార్టీతోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News