Monday, December 23, 2024

లుంగీలు, నైటీలతో బహిరంగంగా తిరగొద్దు..

- Advertisement -
- Advertisement -

నొయిడా : గ్రేటర్ నొయిడా సెక్టార్ 2 లో ఉన్న హిమ్ సాగర్ అపార్ట్‌మెంట్ లోని రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు తమ అపార్ట్‌మెంట్ లోని వారిపై డ్రెస్ కోడ్ విధించారు. అపార్ట్‌మెంట్ లోని బహిరంగ ప్రదేశాల్లో పార్కింగ్ ఏరియాల్లో ప్రజలు లుంగీలు, నైటీలతో తిరగొద్దని నిబంధన విధించారు. ఈమేరకు జూన్ 10న సర్కులర్ జారీ చేశారు. అపార్ట్‌మెంట్ పరిసర ప్రాంతాల్లో తిరిగే సమయంలో మీ దుస్తులు, ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ పెడతారని ఆశిస్తున్నాం.

దీనివల్ల మీ ప్రవర్తనను ఎవరూ తప్పుబట్టరు. దీనివల్ల మీ కుమార్తెలు, కుమారులు మీ నుంచి నేర్చుకుంటారు. అని సర్కులర్‌లో సూచించారు. అయితే అపార్టుమెంట్ వాసులు ఈ డ్రెస్‌కోడ్ నిబంధనలపై విముఖత చూపుతున్నారు. తమ వ్యక్తిగత అవకాశాలపై నిబంధనలేమిటని ప్రశ్నిస్తున్నారు అయితే ఈ సర్కులర్ ఎవరి స్వేచ్ఛను కట్టడి చేయడానికి కాదని, అపార్ట్‌మెంట్ లోని కొందరి మహిళల ఫిర్యాదుపై ఈ సర్కులర్ జారీ చేయడమైందని అసోసియేషన్ వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News