Monday, December 23, 2024

నకిరేకల్ – తాటికల్ ప్లై ఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -
  •  ఇద్దరు యువకుల దుర్మరణం

నల్లగొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన బుధవారం నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని తాటికల్ ప్లైఓవర్ వద్ద చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాటికల్ గ్రామానికి చెందిన నల్లమాద రాజు (28), భీమనబోయిన విజయ్‌కుమార్ (34) బుధవారం నకిరేకల్‌కు వెళ్తున్నారు. న

కిరేకల్ సమీపంలో ఉన్న తాటికల్ ప్లైఓవర్ వద్దకు వెళ్లగానే వెనుక నుంచి అతి వేగంగా నల్లగొండ నుంచి వస్తున్న స్కార్పియో వాహనం ముందు వెళ్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ప్లైఓవర్ కింద ఆగి ఉన్న షిప్టు కారును కూడా ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. షిప్టు కారులో ఉన్న మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కుటుంభీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపికృష్ణ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నల్లమాద రాజు, భీమనబోయిన విజయ్‌కుమార్ మృతదేహాలను నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సందర్శించి సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలను ఓదార్చి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News