Monday, December 23, 2024

రాత్రివేళ రోడ్డుపై రెస్టారెంట్ సిబ్బందితో ఘర్షణ..

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్ : రాజస్థాన్ లో జైపూర్ అజ్మీర్ జాతీయ రహదారిపై రెస్టారెంట్ సిబ్బందితో ఘర్షణకు పాల్పడిన ఐదుగురు అధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ ఐదుగురిలో ఐఎఎస్ , ఐపిఎస్ అధికారులు ఇద్దరు ఉండడం గమనార్హం. ఐఎఎస్ అధికారి, అజ్వీర్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ గిరిధర్, ఐపిఎస్ అధికారి సుశీల్ కుమార్ బిష్ణోయ్ సస్పెండ్ అయ్యారు. ఐపిఎస్ అధికారి వేరే ప్రాంతానికి బదిలీ కావడంతో వీడ్కోలు పార్టీ జరిగింది. ఐపిఎస్ అధికారితోసహా పలువురు పోలీస్ సిబ్బంది కూడా హాజరయ్యారు.

పార్టీ ముగించుకుని వెళ్తున్న సమయంలో రెస్టారెంట్ వాష్ రూమ్ వాడుకునే విషయంలో రెస్టారెంట్ సిబ్బందితో అధికారులు వాగ్వాదానికి దిగారు. అది ఘర్షణగా మారింది. ఐపిఎస్ అధికారి రెస్టారెంట్ సిబ్బందిపై చేయిచేసుకోవడంతో అధికారిపై రెస్టారెంట్ సిబ్బంది కొట్లాటకు దిగారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డు అయ్యాయి. దీనిపై రెస్టారెంట్ యజమాని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ వ్యవహారాన్ని విజెలెన్స్ డిపార్ట్‌మెంట్ దర్యాప్తు చేస్తోందని రాజస్థాన్ పోలీస్ చీఫ్ ఉమేష్ మిశ్రా తెలిపారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఐపీఎస్ అధికారి బిష్ణోయ్ ఖండించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News