- Advertisement -
హైదరాబాద్: గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం జరిగిన వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా… ప్రముఖ ప్రభుత్వ దవాఖాన ‘నిమ్స్’ విస్తరణ పనులకు సిఎం కెసిఆర్ శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ లబ్ధిదారులు ఉదయనగర్ కాలనీ చెందిన పార్వతి, భోళానగర్‌కు చెందిన పర్వీనమ్మ, ఎంబీటీ నగర్‌కు చెందిన శిరీషమ్మ, ప్రతాప్ నగర్ పంజాగుట్ట తేజశ్విని, శ్రీరామ్ నగర్‌కు చెందిన సుజాతమ్మ, అంబేడ్కర్ నగర్ రేణుకమ్మలకు సిఎం కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లను అందచేశారు. అనంతరం వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు సిఎం కెసిఆర్‌కు లక్ష్మినరసింహ స్వామి జ్జాపికను అందచేశారు.
- Advertisement -