Monday, November 25, 2024

పరిపాలన సౌలభ్యమే ప్రభుత్వ లక్షం

- Advertisement -
- Advertisement -

కమాన్‌పూర్: పరిపాలన సౌలభ్యమే లక్షంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని జడ్పీ చైర్మన్ పుట్ట మ ధుకర్ అన్నారు. కమాన్ పూర్ మండల కేంద్రంలో బుధవారం నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాలు, గ్రామపంచాయతీలు అభివృద్ధికి ఆమడ దూరంలోనే నిలిచిపోయా యని అన్నారు.

ఈ క్రమంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నూతనం గా ఏర్పాటైన పంచాయతీలకు సకల సౌకర్యాలు కల్పించాలనే సంకల్పంతో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో భాగంగా నూతన గ్రామపంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించడం జరిగిందన్నారు.

గ్రామపంచాయతీ పాలకవర్గాలు, ప్రజాప్రతినిధు లు ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని, ఆ బాధ్యత మనందరిపై ఉందన్నారు. గ్రామపంచాయతీలో కొలువు దీరిన సర్పంచ్ నీలం సరి తకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాచకొండ లక్ష్మీ, పీఏసీఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చిందం తిరుపతి, మహిళా విభాగం మండల అధ్యక్షులు పొన్నం రాజేశ్వరి, ఎంపీడీఓ విజయ్ కుమార్, ఎంపీఓ శేషయ్య సూరి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు బొల్లపెల్లి శంకర్ గౌడ్, కొండ వెంకటేష్, ఆకుల ఓదెలు, ఎంపీటీసీ కోలేటి చంద్రశేఖర్, ఉపసర్పంచ్ బొజ్జ రాజసాగర్, కా ర్యదర్శి హరీష్, వార్డు సభ్యులు లక్ష్మన్, మౌనిక, కవిత, రామచందర్, కుమార్, అజయ్, హసీనా బేగం, గ్రామ కోఆప్షన్‌సభ్యులు, నా యకులు ఇనగంటి రామారావు, గడప కృష్ణమూర్తిలతోపాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News