Monday, November 25, 2024

ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి కలెక్టరేట్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా చిట్యాల మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైద్యారోగ్య దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిధిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్‌లు గండ్ర జ్యోతిలు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసారు. అనంతరం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, హెల్త్ సబ్ సెంటర్‌లను, పల్లె దవాఖాన, బస్తీ దవాఖాన ఏర్పాటుచేసి మంచి నైపుణ్యం కలిగిన వైద్యులతో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్ ఏర్పాటుచేసి అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. అంతేకాకుండా మన జిల్లాలో వైద్య కళాశాల మంజూరు చేసి నేటి విద్యా సంవత్సరం నుండి తరగతులు ప్రారంభించుకోబోతున్నామని చెప్పడం చాలా సంతోషకరమన్నారు. అంతేకాదు ఆయూష్ హాస్పటల్, వైద్య కళాశాలతో పాటు 500 పడకల ఆసుపత్రి కూడా నిర్మించుకుంటున్నామన్నారు. అడగగానే భూపాలపల్లి జిల్లాలో వైద్య సేవలకు కావాల్సిన ప్రతి విషయంలో వెంటనే స్పందించి మంజూరు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల పట్ల, ప్రజల కొరకు నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి ఆడబిడ్డ పెళ్ళి కళ్యాణలక్ష్మి, గర్బవతి సమయంలో పౌష్టికాహారం, ప్రతి నెల ఉచిత పరీక్షలు, దూర ప్రాంతాల వారికి అమ్మ ఒడి వాహనాలు, తల్లి తండ్రి స్థానంలో సీమంతం వేడుక, ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగబిడ్డ పుడితే రూ.12వేలు, కెసిఆర్ కిట్, అంగన్‌వాడీల ద్వారా అక్షరాభ్యాస వేడుక తిరిగి రెండవ సారి గర్బవతి అయిన వారికి న్యూట్రిషన్ కిట్ వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామన్నారు. వైద్య ఆరోగ్య దినోత్సవం సందర్బంగా ఉత్తమ సేవలందిస్తున్న పల్లె దవాఖాన డాక్టర్లు, పిహెచ్‌సి, సిహెచ్‌సి డాక్టర్లను ప్రత్యేకంగా సన్మానించి ప్రశంసపత్రాలు అందించారు. అనంతరం చిట్యాల మండలానికి సంబంధించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News