Monday, December 23, 2024

వైద్య రంగంలో తెలంగాణ దేశానికే దిక్సూచి

- Advertisement -
- Advertisement -

మరిపెడ: వైద్య రంగంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందని, ప్రతి పల్లెకు, పట్టణానికి వైద్యాన్ని అందించిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలల్లో భాగంగా బుధవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఆడిటోరియంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో డోర్నకల్ నియోజకవర్గ స్ధాయి తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్ గుండాల మురళీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరి ఆరోగ్యమే తెలంగాణ ప్రభుత్వ సంకల్పమని, సిఎం కెసిఆర్ పేదల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారని తెలిపారు.

అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, తెలంగాణలోని పథకాలు ఇతర రాష్ట్రాలు కోరుకుంటున్నాయని తెలిపారు. దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మాతాశిశు సంరక్షణకు కెసిఆర్ కిట్లు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఉన్నతమైన లక్షంతో సిఎం కెసిఆర్ మహిళా సంక్షేమానికి కృషి చేస్తుందన్నారని తెలిపారు. జిల్లా ఏర్పడిన తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన సౌకర్యాలు అందుతాయని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాక శిశు మరణాల సంఖ్య తగ్గించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి గుగులోతు అరుణ రాంబాబునాయక్, జడ్‌పిటిసి తేజావత్ శారధా రవీందర్‌నాయక్, ఓడిసిఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపిపి గుగులోతు వెంకన్న, డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్ మురళీధర్, మండల ప్రత్యేక అధికారి డాక్టర్ సుధాకర్, మరిపెడ వైద్యాదికారి డాక్టర్ ప్రవీణ్, చిన్నగూడూరు డాక్టర్ కరుణాకర్ జాదవ్, తహశీల్ధార్ పిల్లి రాంప్రసాద్, ఎంపిడిఓ కేలోతు ధన్‌సింగ్, గుగులోతు అరుణ రాంబాబునాయక్, తేజావత్ రవీందర్‌నాయక్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News