Wednesday, December 18, 2024

ఆసిఫాబాద్ లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/తాండూర్‌: ఆసిఫాబాద్ జిల్లాలో తాండూర్ గ్రామపంచాయితీ పరిధిలో గల కర్షెలగట్టం గ్రామ సమీపంలో గల అడవి ప్రాంతంలో బుధవారం ఉదయం ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అటవీ అధికారుల సమాచారం మేరకు ఎస్‌ఐ రాజశేఖర్ అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పురుషుడిలా అనవాళ్లు కనిపిస్తున్నాయని, ఆ వ్యక్తి చనిపోయి దాదాపు పది రోజుల నుంచి 20 రోజల వ్యవధి ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. ఫారెస్ట్ బీట్ ఆధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతుడు లుంగీ ధరించడంతో పాటు లైన్స్ ఉన్న బ్లూ కలర్ షర్ట్ ధరించాడని ఎస్ఐ పేర్కొన్నారు.

Also Read: పిల్లల పుస్తకాలపై మీ బొమ్మలేమిటి ? మీ రంగులేంటి?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News