రేగొండ: మండలంలోని జగ్గయ్యపేట గ్రామంలో గురువారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‍తో జరగడంతో రైతు నిల్వ చేసుకున్న పత్తి దగ్ధమయ్యింది. రైతు తెలిపిన వివరాల ప్రకారం సుల్తాన్‌పూర్ గ్రామం నుండి పరకాల వైపు వస్తుండగా జగ్గయ్యపేట గ్రామంలో టిఎస్05యూసి2339 నెంబర్ గల లారీ హైలోడ్ వడ్ల బస్తాలతో రోడ్డుపై వెళ్తున్న క్రమంలో విద్యుత్ వైర్లను తాకడంతో స్తంభాలు విరగడం వలన షార్ట్ సర్యూట్‌తో ఇంట్లో నిల్వ ఉంచిన రూ.2లక్షల విలువైన 30 క్వింటాళ్ల పత్తి దగ్ధమైనట్లు తెలిపారు.
సకాలంలో అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానిక సర్పంచ్ పాతపెల్లి సంతోష్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మటిక సంతోష్, ముడుపు అశోక్‌రెడ్డి సకాలంలో స్పందించి అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయగా వారు వచ్చి మంటలను అర్పివేశారని, ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రమాదంలో రోడ్డుకిరువైపులా వైర్లు ముక్కలుగా తెగిపడి రోడ్డుపై పడి మంటలు వ్యాపించాయి. సకాలంలో స్పందించిన సర్పంచ్ సంతోష్, మండల నాయకులు మటిక సంతోష్, వార్డు సభ్యులు అశోక్‌రెడ్డిలకు రైతులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.